అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని సనప గ్రామానికి చెందిన ఉమేష్ అనే ఏడాదిన్నర వయస్సు ఉన్న చిన్నారి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.