అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని కుందుర్పి మండలం ఎర్రగుంట గ్రామంలో వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటుండగా రైతుకు పాముకాటు వేసింది. దీంతో రైతు ని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం శనివారం మధ్యాహ్నం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.