అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఉరవకొండ మండలం పెన్నహోబిలం లో ప్రమాదవశాత్తు చింత చెట్టు పై నుంచి పడి కోణాపురం గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకోగా ఆదివారం సాయంత్రం అతని మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.