యర్రగొండపాలెం: ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజా సమస్యలను అర్జీ రూపంలో అందుకున్న టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలు పలు సమస్యలను అర్జీ రూపంలో ఆయనకు అందజేశారు. ప్రజల యొక్క సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో సమస్యలు లేకుండా పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.