ఆలూరు: దేవనకొండలో వలసల నివారణ లో అధికారులు విఫలం:వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీర శేఖర్
Alur, Kurnool | Dec 1, 2025 దేవనకొండ మండలంలో తీవ్రమైన అతివృష్టి అనావృష్టి పరిస్థితుల రీత్యా గ్రామాల్లో వ్యవసాయ పనులు లేక, గ్రామీణ పేదలు సుదూర ప్రాంతాలకు వలసలు పోతున్నారని వలసల నివారణలో ప్రభుత్వం, అధికారులు తీవ్రంగా వైఫల్యం చెందారని, వెంటనే గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాలని ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.