గుత్తి కోటలో దత్త మండలాల కలెక్టర్ సర్ థామస్ మన్రో 265 వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గుత్తి కోట సంరక్షణ సమితి, మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్ థామస్ మన్రో సమాధిపై పూలు చల్లి నివాళులర్పించారు.ఈ సందర్భంగా గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షులు జయభాస్కర్, గైడ్ రమేష్ మాట్లాడారు. దత్త మండలాల అభివృద్ధి కొరకు మన్రో కృషి చేశారన్నారు.