నగరి: పుత్తూరులో యాంకర్ అనసూయ సందడి
పుత్తూరు పట్టణంలో సినీనటి, యాంకర్ అనసూయ బుధవారం సందడి చేశారు. పుత్తూరు-నగరి మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షోరూం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా వచ్చారు. ఆమెను చూడటానికి పలువురు పట్టణానికి తరలి వచ్చారు. అభిమానులను అనసూయ పలకరించి ఉత్తేజపరిచారు.