కొండపి: సింగరాయకొండ ఒంగోలు మధ్య విస్తృతంగా రైళ్ల తనిఖీలు చేపట్టిన ఈగల్ టీం,11.5 ఐదు కేజీల గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్
ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఒంగోలు మధ్య జరిగిన విస్తృత రైళ్ల తనిఖీలలో 11.5 కేజీల గంజాయి 32 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం ఈగల్ టీం సీఐ సుధాకర్ రావు వెల్లడించారు. విశాఖపట్నం నుంచి మద్రాసు వైపు వెళ్లే అలా పూజా ఎక్స్ప్రెస్ రైల్లో గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ సుధాకర్ రావు మీడియాకు తెలిపారు.