బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రమణ్యం జయ జయహే తెలంగాణ పాడడానికి నిరాకరించాలని ఒక రూమర్ ఉందని అందుకే ఆయన విగ్రహాన్ని పెట్టొద్దని తెలంగాణ వాదులు అంటున్న సందర్భం ఉందని తెలిపారు. రవీంద్రభారతిలో తెలంగాణ జానపద కళాకారుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. తాను ఎల్లప్పుడూ తెలంగాణ వాదుల పక్షాన ఉంటానని తెలిపారు.