శ్రీశైలంలో మూడో రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.వేకువజామున దేవస్థానం ఆధ్వర్యంలో భోగిమంటల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.శ్రీస్వామి అమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు, మహామంగళహారతుల అనంతరం,ప్రధాన ఆలయ మహాద్వారం ఎదుట గంగాధర మండపం వద్ద సంప్రదాయబద్ధంగా భోగిమంటలు వెలిగించారు. అర్చకులు, వేదపండితులు లోకకల్యాణం కోసం సంకల్ప పఠనం చేశారు.భోగిమంటల ముందు భక్తుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.