ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : రఘునాథపల్లి మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఐ నరేష్
రఘునాథపల్లి మండల కేంద్రంలో ని అండర్ బ్రిడ్జి వద్ద చలివేంద్రాన్ని ఎస్సై నరేష్ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు నిత్యం వస్తుంటారని ఆయన వెల్లడించారు. వారి దాహం తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువత ,సేవా సంఘాలు జన సమర్థం కలిగిన ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి సేవా దృక్పథాన్ని కనబడుచుకోవాలని ఆయన కోరారు.