కంది పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి స్వాగతించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించడం అభినందనీయమన్నారు. కందులతో పాటు పెసలు, మినుములను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.