పార్వతీపురం: జిల్లా ప్రభుత్వ కార్యాలయాల సముదాయ రహదారిలో గోతులు, ఇబ్బందులు పడుతున్న ప్రజలు #localissue
పార్వతీపురంలోని జిల్లా ప్రభుత్వ కార్యాలయ సముదాయ రహదారి గోతులమయం కావడంతో ప్రజలు ఉద్యోగులు ఆయా కార్యాలయాలకు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ సి ఎం పాఠశాలలో సుమారు 15 ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. వాటికి రాకపోకలు సాగించే రహదారి మొత్తం గోతులు మయమై వర్షపు నీరు నిల్వ ఉండటంతో ఉద్యోగులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారి వద్ద ప్రస్తావించేందుకు ప్రయత్నించుగా అందుబాటులో లేరు.