బనగానపల్లెలో అయ్యప్ప స్వాములు ఇరుముడి మహోత్సవం
నంద్యాల జిల్లా బనగానపల్లెలోని స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో మాలధారణ చేసిన స్వాముల ఇరుముడి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. 40 రోజులపాటు భక్తి, నియమ నిష్ఠలతో మండల దీక్షను పూర్తి చేసుకున్న స్వాములు, పూజా కార్యక్రమాల అనంతరం శబరిమలై యాత్రకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.