బద్వేల్: కాశినాయన: ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ
Badvel, YSR | Jul 14, 2025 కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కాశినాయన మండలం రెడ్డి కొట్టాల గ్రామంలోని జడ్పీ, ఎంపీపీఎస్ పాఠశాలలో సోమవారం ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ ప్రతినిధులు 80 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపీర్, హెడ్ మాస్టర్ రాధిక మాట్లాడుతూ పేద విద్యార్థులకు సహాయం చేసిన ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు బాగా చదివి మంచి స్థాయికి చేరుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు,సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.