కొత్తకోట: కనిమేట్ట గ్రామంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు...
దేవరకద్ర నియోజకవర్గ కొత్తకోట మండల పరిధిలోని కనిమేట్ట గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ కృష్ణ బాల బ్రహ్మేంద్ర ఆశ్రమంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ గురు బ్రహ్మ బ్రహ్మయ్య స్వామి ఆధ్వర్యంలో ఉదయం నుండి విశేష పూజలు చేపట్టారు. శ్రీ హనుమాన్ హోమం శ్రీ వీరాంజనేయ స్వామి వ్రతం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అన్న ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా mpp గుంత మౌనిక మల్లేష్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు,తదితరులు ఉన్నారు.