కొల్లాపూర్: భూమిని కాపాడి జీవజాతులను రక్షించుకుందాం కొల్లాపూర్ లో ఎర్త్ డే సందర్భంగా విద్యార్థుల అవగాహన ర్యాలీ
భూమిని కాపాడి జీవజాతులను రక్షిద్దామంటూ విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు కొల్లాపూర్ లో సోమవారం ఎర్త్ డే సందర్భంగా పట్టణంలోని విద్యార్థులు ర్యాలీ చేపట్టారు పర్యావరణం పై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ సమస్త జీవకోటి కి భారాన్ని మోసేది భూమి అని పర్యావరణం వాతావరణంతో పాటు జీవన శైలిలో మార్పులతో భూ పరిరక్షణపై అవగాహన కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు