అహుడ పరిధిలో ఎస్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నగరంలోని అహుడా కార్యాలయంలో అహుడాపై జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ కింద వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద లేఔట్ అయిన ధర్మవరం కునుతూరు లేఅవుట్ లోని ప్లాట్లు కొనుగోలు కోసం వెబ్ సైట్ నందు రిజిస్టర్ చేసుకోవాలన్నారు.