గుంతకల్లు: గుత్తి అర్ఎస్ రోడ్డులో లక్ష్మమ్మ గుడి వద్ద స్తంభాలను ఢీ కొన్న లారీ, కూలిన స్తంభాలు, తప్పిన పెను ప్రమాదం
అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ రోడ్డులో లక్ష్మమ్మ గుడి ఎదురుగా కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. ఆదివారం రోడ్డు మధ్యలో ఉన్న సెంట్రల్ లైటింగ్ విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టి వెళ్ళిపోయింది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న లారీ గుత్తి అర్ఎస్ రోడ్డులో కేంద్రీయ విద్యాలయం సమీపంలో డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాలను ఢీ కొట్టడంతో అవి నెలకూలాయి. లారీ డ్రైవర్ మద్యం మత్తులో తూగుతూ లారీని అదుపు చేయలేక గుత్తి వైపునకు వెళ్తూ రోడ్డు డివైడర్ పైకి ఎక్కి రెండు స్తంభాలను ఢీ కొట్టడంతో అవి రోడ్డుకు అడ్డంగా పడి పెను ప్రమాదం తప్పింది.