రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగకుండా ఉంటే చర్యలు తప్పవని సీఐ హనుమంతు నాయక్ హెచ్చరించారు. ఆదివారం కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు అల్లర్లు, అలజడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. చెడు నడత కలిగిన రౌడీ షీటర్లపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.