దుబ్బాక: దుబ్బాక పట్టణంలో ప్రధాన పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారి, జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రధాన పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటరు నమోదు కు చెందిన ఫామ్స్ డిస్ఫోజల్, నామినేషన్ కు సంబంధించిన వివరాలను చర్చించి నాయకుల కు నియమ నిబంధనలు వివరించారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ నమోదును సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన తహసీల్దార్ లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.