గుంతకల్లు: గుత్తి పట్టణంలోని కర్నూలు రోడ్డులో రెండు బైకులు ఎదురెదుగా ఢీ, ఇద్దరికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
గుత్తి పట్టణంలోని కర్నూలు రోడ్డులో గురువారం ఉదయం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో చెంబులు బావి వీధికి చెందిన దినేష్ రెడ్డి, చైతన్య (బన్నీ) అనే ఇద్దరికీ గాయాలు. గాయపడిన వారిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు చైతన్య బన్నీ మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.