ఆత్మకూరు: ఆత్మకూరు : సుపరిపాలనలో తొలి ఏడాది పూర్తి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపిన మంత్రి ఆనం
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని 27124 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు 13 వేల రూపాయల చొప్పున మొత్తం 35 కోట్ల 26 లక్షల 12 వేల రూపాయలు జమచేశామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ 22వ వార్డు వీవర్స్ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్నీ నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఎన్నికల హామీలో భాగంగా ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక్కొకటిగా అమలు చేస్తూ ముందుకు వెళుతుందనీ తెలియజేశారు. సుపరిపాలనలో తొలి ఏడాది పూర్తి కార్యక్రమానికి ప్రజల నుంచి వి