ఐపీఎల్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు, బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై మణికంఠ
నంద్యాల జిల్లా నందికొట్కూరు నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే, నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీఎల్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై మణికంఠ హెచ్చరించారు, అమాయకులను క్రికెట్ బెట్టింగ్ పేరుతో ప్రోత్సహించిన చట్టపరమైన చర్యలు తప్పన్నారు,ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ లు నిర్వహిస్తే 100 లేదా 9121101191 నెంబర్లకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు