నందికొట్కూరు సీఎం సార్ మీరే మాకు న్యాయం చేయండి,98 జీవో బాధితుడు జయన్న ఆవేదన
నంద్యాల జిల్లా నందికొట్కూరు సీఎం సార్ మీరే మాకు న్యాయం చేయండి అంటూ 98 జీవో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన జయన్న శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇల్లు పొలాన్ని కోల్పోయారు, 2003లో నీటిముంపు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నానని ఇప్పటివరకు ఎటువంటి ఉద్యోగం కల్పించలేదని వాపోయారు,గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ గారు జీవన భృతి లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు, మీరు ఉద్యోగం కల్పించి న్యాయం చేయాలని కోరారు