పెద్దమందడి: వరి ధాన్యాన్ని రైతుల సమక్షంలో తూకం చేసి మిల్లుకు పంపాలి జిల్లా కలెక్టర్
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో ఐ. కె.పి ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కోనుగోలు కేంద్రంలో రైతులకు కల్పించిన వసతులు పరిశీలించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో 40 కిలోలకు ఒక అర కిలో అదనంగా తూకం చేసి వరి బస్తాలు మిల్లులకు పంపిస్తే అక్కడ తూకం తక్కువ చేసి చూపుతున్నారని కలక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలక్టర్ లారి వెంట ఒక రైతును మిల్లుకు పంపించాలని రైతు సమక్షంలో తూకం చూసుకోవాలని సూచించారు. కారణం లేకుండా తూకం తక్కువ చూపడానికి వీలు లేదని ఆదేశించారు.