కల్వకుర్తి: తలకొండపల్లిలో మానవ అక్రమ రవాణా నివారణ పై శిక్షణ కార్యక్రమం..
కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లి మహిళా శిశు సంక్షేమ శాఖ తలకొండపల్లి మరియు ప్రజల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సూపర్వైజర్లు మమతా తిరుమల కవిత ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మండల మహిళా సమైక్య భవనంలో ప్రారంభించారు... ఈ సందర్భంగా ప్రజ్వల కోఆర్డినేటర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ నేటి సమాజంలో కొత్త పద్ధతుల ద్వారా సైబర్ ట్రాఫికింగ్ జరుగుతుందని మొబైల్ ఫోన్ ఆన్లైన్ వాడుతున్న వారు ఎవరైనా దీనికి గురవుతున్నారని అక్రమ రవాణా నాకు గురైన వారిని శ్రమదోపిడి అవయవాలు దోపిడీ మరియు లైంగిక దోపిడికి గురవుతున్నారని అన్నారు..