భూపాలపల్లి: రైతులకు సరిపడా యూరియాన ఇవ్వాలి : చైన్ పాక గ్రామ రైతులు
భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండలం చైన్ పాక గ్రామంలో ఉదయం ఐదు గంటల నుంచి యూరియా కోసం క్యూ లైన్ లో వేచి చూస్తున్నట్టు రైతులు శుక్రవారం ఉదయం 10 గంటలకు తెలిపారు. యూరియా లోడ్ వచ్చినప్పటికీ అధికారులు మాత్రం ఇప్పటివరకు యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెంటనే రైతులకు సరిపడా యూరి అందించాలని డిమాండ్ చేస్తూ పిఏసిఎస్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు.