గుత్తి కోట ఏఐ వీడియో తెగ వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన గుత్తి కోటకు సంబంధించిన ఏఐ వీడియోను గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చౌదరి విజయభాస్కర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయగా ప్రస్తుతం గురువారం నుంచి తెగ ట్రెండింగ్ అవుతోంది. పురాతన కోటలలో గుత్తి కోట ఒకటి. సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కోటను చాళక్యుల కాలంలో కట్టారని చరిత్ర చెబుతోంది. చారిత్రాత్మక కట్టడమైన గుత్తి కోట ఏఐ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చూసిన ప్రతి ఒక్కరికీ కోట అందాలు ఆకట్టుకుంటున్నాయి. గుత్తి కోటలో 15 బురుజులు, 15 ముఖద్వారాలు ఉన్నాయి.