కొత్తకోట: అంగరంగ వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం...
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండల పరిధిలోని ఖానాయపల్లి గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ కోటిలింగేశ్వర స్వామి దత్త దేవస్థానంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ఆది దంపతుల కళ్యాణం తిలకించారు.అనంతరం మహిళలు అమ్మవారికి వడి బియ్యం పెట్టి మొక్కలు తీర్చుకున్నారు. అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.