ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : వ్యాపారబోళ్ల తండాకు చెందిన నాటు సారా తయారుదారుడిని జైలుకు తరలించిన ఎక్సైజ్ పోలీసులు
చిలుపూర్ మండలం యాపలబోళ్ల తండాకు చెందిన కొమ్మరాజుల ఎల్లయ్య నాటుసార తయారుచేసి విక్రయిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం చర్లపల్లి జైలుకు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ భాస్కరరావు తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం గతంలో కొమ్మరాజుల ఎల్లయ్య నాటు సారా తయారుచేసి అమ్ముతుండగా పట్టుబడినట్లు తెలిపారు. ఆయనను తహసిల్దారు వద్ద బైండోవర్ చేయగా,మళ్ళీ సారాయిని తయారు చేస్తుండగా శుక్రవారం ఎల్లయ్యను పట్టుకొని తహసిల్దార్ వద్ద బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించగా అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ఎల్లయ్యను చర్లపల్లి జైలుకు తరలించినట్లు సిఐ తెలిపారు.