తాడేపల్లిగూడెం: ఆర్డీవో కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన మార్నిడి శేఖర్@బాబ్జి.
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున మార్నిడి శేఖర్ @ బాబ్జి నామినేషన్ దాఖలు చేసినట్లు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మరియు ఆర్డీవో కె.చెన్నయ్య తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు నామినేషన్ పర్వం బుధవారం ఒక నామినేషన్ దాఖలు కాగా ఇంతకు ముందు నామినేషన్ దాఖలు చేసిన ఇద్దరు రెండవ సెట్టు ను అందించినట్లుగా తెలిపారు.అయితే నామినేషన్లు స్వీకరణలకు రేపు 25వ తేదీ ఆఖరి తేదీ అని వెల్లడించారు.