బాటవారిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
బాటవారిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పంపిణీ చేశారు. కలకడ మండలం బాటివారిపల్లి గ్రామంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ సోమవారం ఉదయం కలకడ మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. బాటవారిపల్లి గ్రామంలో పర్యటించి వృద్ధుల ఇళ్ళకు వెళ్ళి స్వయంగా వేలిముద్రలను తీసుకొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పారదర్శకంగా చేపట్టి 100% పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాను ప్రసాద్, సెక్రెటరీ నందిని తదితరులు పాల్గొన్నారు