మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని విట్టా సుబ్బారత్నం కళ్యాణ మండపంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. ముందుగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాని ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన కార్యకర్తలను అభినందించారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం మీద తెలుగుదేశం పార్టీ స్థాపించారని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు నేటికీ స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు.