గుంతకల్లు: తొండపాడు లో అప్పుల బాధ తాళలేక మహేంద్ర కుమార్ అనే రైతు ఉరివేసుకొని ఆత్మహత్య
గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ఆదివారం సాయంత్రం అప్పుల బాధ తాళలేక మహేంద్ర కుమార్ అనే రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు మేరకు మహేంద్ర తన భూమితో పాటు మరికొంత భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడు ఈ క్రమంలో పంటల సాగుకు పొలంలో బోర్లు వేసేందుకు వ్యవసాయ మరియు కుటుంబ అవసరాలకు పది లక్షలకు పైగా అప్పు చేశాడు పంటలు పండకపోవడంతో అప్పులు తీర్చలేని పరిస్థితిలో మధనపడుతూ ఆదివారం ఇంటి పైకప్పుకు ఉరి వేసుకున్న ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.