ఆలూరు: ఆస్పరిలో ఆలూరు వైపు పొలాలకు వెళ్తున్న ఎద్దుల బండిని ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ లారీ
Alur, Kurnool | Dec 1, 2025 ఆస్పరి మండల కేంద్రంలో రైల్వే గేట్ సమీపాన ఆలూరు వైపు పొలాలకు వెళ్తున్న ఎద్దుల బండిని, జేఎస్ఈడబ్ల్యూ సిమెంట్ ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎద్దులబండిపై ఉన్న ఇద్దరు రైతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పొగమంచు కారణంగా సరిగా కనపడకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు లారీ డ్రైవర్ పోలీసులకు వివరించారు