ఆత్మకూరులో కల్తీ నెయ్యి కలకలం రేపింది. దుద్యాల రస్తాలోని ఎరుకల పేటకు చెందిన కావేటి రాజు అనే వ్యక్తి తన ఇంట్లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నాడన్న సమాచారంతో విజిలెన్స్ సిఐ పవన్ కిశోర్, ఆత్మకూరు సీఐ మహేశ్వర్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ అదికారులు సోదాలు నిర్వహించారు.సోదాల్లో 20 కేజీల కల్తీ నెయ్యి, కల్తీ నెయ్యి తయారికి వినియోగించే 4కేజీల పౌడర్, గీత ప్లానర్ ద్రావణం స్వాధీనం చేసుకున్న అధికారులు. పాలకోవా తయారు చేశాక మిగిలిన గసి, పామాయిల్ తో మరిగించి గీ ఫ్లేవర్ ద్రావణం కలపడం ద్వారా కల్తీ నెయ్యి తయారవుతుంది. ఇలా తయారు చేసిన కల్తీ నెయ్యిని మార్కెట్లో విక్రయిస్తున్నారు.