మేడిపల్లి: నూతన ఎస్ఐగా శ్రీధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని మేడిపల్లి ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జిల్లాలో ఇద్దరు ఎస్ఐల బదిలీలు జరిగాయి. బుగ్గారం ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డిని మేడిపల్లికి బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుగ్గారం పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ శ్రీధర్ రిలీవ్ అయి మేడిపల్లి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు.శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.చట్టవ్యతిరేక పనులు ఎవరు చేసిన ఉపేక్షించబోమని ఎస్సై చెప్పారు.