ధర్మపురి: గొల్లపల్లి మండలంలో పలువురి కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి ఈశ్వర్
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం పర్యటించారు. గొల్లపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు చెవుల రవింధర్ తండ్రి చెవుల రాజలింగయ్య దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. అనంతరం మండలంలోని గంగదేవిపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ కాసాని శేఖర్ తండ్రి నర్సయ్య ఇటీవలే మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మండలంలోని శ్రీరాములపల్లె గ్రామ బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు గాజంగి గణేష్ తండ్రి మల్లేశం ఇటీవలే అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు