నంద్యాల కోవెలకుంట్లలోని జమ్మలమడుగు రోడ్డులో ఉన్న అష్ట లక్ష్మి వేంకటేశ్వర దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన మంగళవారం వైకుంఠ ఏకాదశి వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మయ్య బుధవారం మీడియా తెలిపారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకొనుటకు ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు.