పత్తికొండ: వెల్దుర్తి మండలం లో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వెల్దుర్తి మండలంలో గురువారం విషాదఘటన చోటుచేసుకుంది. మండలంలోని మల్లేపల్లెకు చెందిన బోయ మహేశ్ ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ దిశ నుంచి వస్తున్న ఐచర్ లారీ ఢీకొంది. తలకు తీవ్రగాయాలైన మహేశ్ను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.