జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుత్తిలో సోమవారం సీపీఎం నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. గుత్తిలోని ఆర్ అండ్ బీ బంగ్లా వద్ద సీపీఎం రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యులు రాంభూపాల్ బైక్ ర్యాలీని ప్రారంభించారు. బైక్ ర్యాలీ గుత్తి నుంచి ఊటకల్లు వరకు నిర్వహించారు. ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడం అన్యాయమని నినదించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి నిర్మల, రేణుక, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.