అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని సోమలదొడ్డి వద్ద ఆదివారం 11 గంటల నుంచి నాలుగు గంటల వరకు శ్రీ అసర్ధ నారాయణస్వామి తిరుణాల సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో అక్కిరెడ్డి ఆలయ ప్రధాన అర్చకుడు రామకృష్ణ శర్మ మాట్లాడుతూ శ్రీ అసర్ధ నారాయణస్వామి వారి తిరుణాల సందర్భంగా ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు నిర్వహించి భక్తులకు ఎలాంటి అవసరం లేకుండా దర్శన ఏర్పాట్లను చేయడం జరిగిందని శ్రీ అశ్రద్ధ నారాయణస్వామి ఆలయ ఈవో అక్కిరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు రామకృష్ణ శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అంతా పాల్గొన్నారు.