అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో సోమవారం మూడు గంటల యాభై నిమిషాల సమయంలో స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఆత్మకూరు మండల వ్యాప్తంగా 956 మహిళా సంఘాలు ఉన్నాయని ఎనిమిది వేల 766 మంది సభ్యులు మహిళలు మహిళా సంఘాల్లో ఉన్నారని వారికి 11% వడ్డీ అనగా 92 పైసలతో భారీ రుణాలు మంజూరు చేయడం జరిగిందని వ్యవసాయ ఖర్చులకు 50,000 అప్పులు తీసుకోవచ్చని గొర్రెలకు 75000 రూపాయలు రుణాలు ఇస్తారని వీటిని సక్రమంగా వినియోగించుకుని అభివృద్ధికి రావాలని పరిటాల సునీత పిలుపునిచ్చారు.