గుంతకల్లు నియోజకవర్గంలో నా పేరు చెప్పి ఎవరైనా అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలకు పాల్పడితే తాటతీస్తానని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన పేరు చెప్పి టీడీపీ నాయకులు లేదా తన కుటుంబసభ్యులు ఎవరైనా దౌర్జన్యాలకు పాల్పడితే తన దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. అనంతపురం రోడ్డులో కొందరు కబ్జా చేసిన భూమిని అర్ అండ్ బీ శాఖ స్వాధీనం చేసుకుందన్నారు.