ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలోని చిలుపూర్, స్టేషన్ ఘన్ పూర్,జఫర్గడ్, రఘునాథపల్లి మండలాల పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుండి మొదలైన ఉరుములు, మెరుపులతో వర్షం భారీ కురిసింది. వేసవి తాపంతో శుక్రవారం రాత్రి వరకు ఈ ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా, శనివారం తెల్లవారేసరికి వాతావరణంలో పెను మార్పులు రాగా ఉదయం నుండి ఆకాశం మేఘావృతం మై, మరోవైపు ఉరుములు, మెరుపులు మెరుస్తుండగా ప్రజల కొంత భయపడ్డారు .అకాల వర్షం కురవడంతో రైతులు వేసిన వారి పంటల వల్ల కొంత రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు .జనగాం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.