విశాఖపట్నం: పిల్లల లక్ష్య సాధనలో తల్లిదండ్రుల తోడ్పాటు చాలా అవసరమని, వారే తొలి గురువులని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్
విశాఖపట్టణం: పిల్లల లక్ష్య సాధనలో తల్లిదండ్రుల తోడ్పాటు చాలా అవసరమని, వారే తొలి గురువులని.. వారి అలవాట్లు, నడవడికే పిల్లలపై చాలా ప్రభావం చూపుతుందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. చిన్నారులకు రోజూ ప్రత్యేక సమయం కేటాయించాలని, పాఠశాల నుంచి వచ్చాక కుశల ప్రశ్నలతో వారిని ఉత్తేజపరచాలని సూచించారు. మనసువిప్పి మాట్లాడాలని, వారి మనసులో ఉన్న భావాలను తెలుసుకోవాలని హితవు పలికారు. పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువులపైన ఎంత బాధ్యత ఉందో.. తల్లిదండ్రులపై కూడా అంతే ఉందని పేర్కొన్నారు