ప్రొద్దుటూరు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వస్త్ర దుకాణాల యాజమాన్యులు,ఉద్యోగులతో సంతకాల సేకరణ
Proddatur, YSR | Nov 20, 2025 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రొద్దుటూరు పట్టణంలో గురువారం వస్త్ర భారతి వస్త్ర దుకాణాల సముదాయాల్లో ప్రచారం నిర్వహించారు. వస్త్ర భారతి, వివేకానందక్లాత్ మార్కెట్లోని దుకాణాల యజమానులు, ఉద్యోగులను కలిశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారితో సంతకాలు చేయించారు. కోటి సంతకాల ఉద్యమం చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు.