భూపాలపల్లి: అంబేద్కర్ సెంటర్ నుంచి ఓపెన్ కాస్ట్ వరకు రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం ముందు గురువారం ఉదయం 11 గంటలకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించినట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాలుగు కోట్ల రూపాయల నిధులతో అంబేద్కర్ సెంటర్ నుంచి ఓపెన్ కాస్ట్ వరకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించామని, ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే పనులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాడని వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర.