సంక్రాంతి సరదాగా చిన్న పిల్లలు ఎగరవేసిన గాలిపటాలు సరదాగా పక్షులకు ప్రాకసంకటంగా మారింది. గాలిపటం దారం లో చిక్కుకుని విలవిల లాడిపోతున్నాయి. మెన్న ఉరవకొండ లో కొంగ గాలిపటం దారంలో చిక్కుకుపోగా నేడు రాయదుర్గం పట్టణంలో ఇలాంటి ఘటనే సోమవారం చోటు చేసుకుంది. దారంలో కొంగ రెక్కలు చిక్కుకుపోగా తోటలో పని చేస్తున్న ఓ రైతు చూసి చలించిపోయాడు. ఆ కొంగను కాపాడాడు.